దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డా..వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

పత్తికొండ   ముచ్చట్లు:
నేడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డా..రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అదే విధంగా రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొనేందుకు హాజరవుతున్నారు. గురువారం పట్టణంలో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయ్యారు. అదేవిధంగా పట్టణ గ్రామీణ రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి మండల అధికారులు ఆర్.బి.కే కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఒక పక్క వైఎస్ఆర్ జయంతి, మరో పక్క రైతు దినోత్సవ వేడుకలు ఉండటంవల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. విజయవంతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కి పార్టీ నాయకులు మండల అధికారులు ఘనంగా స్వాగతించనున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The late Chief Minister Dr. YS Rajasekhar Reddy’s birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *