అధికారుల అలసత్వం..నిర్లక్ష్యం
వృథాగా మిగిలిపోయిన బయో మందులు
నూజివీడు ముచ్చట్లు:
రైతులకు అందాల్సిన బయో మందుల ప్యాకెట్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయి నిరు ఉపయోగంగా ఉన్న వైనం బయటకు వచ్చింది. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం సంబంధింన గోడంలో ఎక్స్పైరీ అయిన తోటలకు పిచికారీ చేసే బయో మందులు లభ్యం అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో సుమారు ఐదు లక్షల రూపాయల మందుల ప్యాకెట్లు ఎక్స్పైరీ అయిపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఒక గ్రామంలోనే ఐదు లక్షల రూపాయల స్టాక్ ఉపయోగం లేకుండా పోయింది అంటే నియోజకవర్గంలో ఎన్ని చోట్ల ఇలా జరిగిందో ఉన్నతాధికారులు విచారించాలని రైతులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపుతున్న బయోటెక్ మందులు, ఎరువులు,ఇతర సామాగ్రి కిందిస్థాయి సిబ్బంది వల్ల రైతులకు అందకుండా పోయాయి. సుమారు 50 బాక్సుల్లో కొన్ని వేల ప్యాకెట్లు రైతు భరోసా కేంద్రంలో మీడియాకి చూపించి రైతులు వాపోతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The laziness of the officers..the negligence