పది ఉత్తమ ఫలితాలకు కారణం లీడ్ ప్రోగ్రాం
విశాఖపట్నం ముచ్చట్లు:
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి లీడ్ ప్రోగ్రాం ప్రధాన కారణమని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 570 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సిరిపురం బాలల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌తో విందుకు ఆహ్వానించారు.అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ మొత్తం 82.68 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. ఇందులో 570 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 63 మంది ఉన్నారని తెలిపారు. ఆగస్టు 16 నుంచి అదనపు తరగతులు, 100 రోజుల ప్రణాళిక అమలు, సబ్జెక్ట్ నిపుణులతో నూతన ప్రశ్నపత్రాలపై అవగాహన కల్పించడం, సమష్టి కృషితో విజయం సాధ్యమైందన్నారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూచనలు, సలహాలు అమలు చేసినట్లు తెలిపారు.
Tags; The lead program is the reason for the ten best results

