పుంగనూరు నుంచి గుంటూరులో ప్లీనరీకి తరలిన నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సారీసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం గుంటూరులో ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను తరలించే పనిలో నేతలు నిమగ్నమైయ్యారు. గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో పుంగనూరు మున్సిపాలిటి నుంచి ఒక బస్సులో బయలుదేరారు. అలాగే మండలం నుంచి రెండు బస్సులతో పాటు ఒకొక్క పంచాయతీ నుంచి మూడు కార్లలో నాయకులు, ప్రజాప్రతినిధులు బయలుదేరారు. వాహనాలకు స్టిక్కర్లు ఏర్పాటు చేసి, పుంగనూరు నుంచి తరలివెళ్తున్న వాహనాలకు నెంబర్లను కేటాయించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం నుంచి 15 బస్సులు, సుమారు 400 కార్లలలో నేతలు బయలుదేరారు. అలాగే పుంగనూరు నియోజకవర్గం నుంచి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండ భోజనము, వసతి కార్యక్రమాలను గుంటూరులో ఏర్పాటు చేశారు.

 

Tags: The leaders moved from Punganur to the plenary in Guntur

Leave A Reply

Your email address will not be published.