కౌలు రైతులకు దిక్కేది

ఏలూరు ముచ్చట్లు:

పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్‌సి) విషయంలో ఊహించిందే జరిగింది. నూతన చట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరికదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59 వేల మంది కౌలు రైతులకు రూ. 319 కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడింది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలిప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల (జెఎల్‌జి) మోడల్‌ను సరికొత్తగా ఎంచుకుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి) తాజా గణాంకాలు వెల్లడించాయి.కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆ చట్టం బాగానే ఉపయోగపడింది.

 

రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా, 2019 మేలో అధికారంలోకొచ్చిన వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతం కంటే అధికంగా మేలు చేస్తుందని పేర్కొంది. కాగా 2019 అక్టోబర్‌ 2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా, ఆ ఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు. 2020 ఖరీఫ్‌లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఆ సంవత్సరంలో 4,87,788 మందికి కార్డులివ్వాలనుకోగా, 4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది. వాటికి స్వయం సహాయక సాగుదారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌) అని పేరుపెట్టింది.అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకులు కేవలం 59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ.319.68 కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపుల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలం రూ.75.16 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు 79,809 మందికి రూ.394.84 కోట్లిచ్చాయి. మొదటి, రెండు సంవత్సరాల్లో ఎంత మంది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90,824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే.

 

సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటి వరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలిక పంట రుణాలకు చేసిన కేటాయింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75 వేల కోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన 2019-20లో సైతం పాత సంప్రదాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84 వేల కోట్లు కాగా, కౌల్దార్లకు రూ.8,400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాల టార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500 కోట్లు మాత్రమేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పది శాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100 కోట్లను కౌలు రైతులకు ప్రతిపాదించారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:The lease is a blow to farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *