అనుమానస్పద స్థితిలో చిరుత మృతి

Date:14/01/2019
నిజామాబాద్ ముచ్చట్లు:
ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి శివారులో జరిగింది. చిరుత కళేబర్ ముక్కలు ముక్కలుగా పడి వుండడం అనేక అనుమానాలకు దారి తీసింది.  చిరుతను చంపారా లేక అడవి జంతువులు చంపాయా అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 4న ఆడీవి మామిడిపల్లి శివారులో కంచేలో చిరుత పులి చిక్కుకుంది. అలా చిక్కుకున్న చిరుత 8 గంటల తర్వాత తప్పించుకున్నట్లు సమాచారం. అయితే, మళ్లీ చిరుతను పట్టుకొవడానికి ఆటవీశాఖ విఫలయత్నం చేసింది. పోలీసులు కుడా డాగ్ స్కాడ్ తో పరిశీలించారు.
Tags:The leopard killed the suspiciously suspiciously

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *