ఉత్తమ్ ఒక అజ్ఞాని :  కర్నె ప్రభాకర్:

The letter is an anonymous: Corne Prabhakar:

The letter is an anonymous: Corne Prabhakar:

 Date:11/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారు. .టీడీపీ కి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. భజన హామీల అమలుకోసం తెరాస ఎప్పట్నుంచో అడుగుతోంది. .మా మంత్రి హరీశ్ రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. నదీ జలాల పంపకం పై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యం లో కెప్టెన్గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్ కు కనీస పరిజ్ఞానం లేదని అయన అన్నారు. నదీ జలాల విషయం లో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉంది.
ఆ అపెక్స్ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు కు వత్తాసు పలికాడని విమర్శించారు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు ..ఉత్తమ్ దాన్ని సమర్దిస్తున్నాడు. ఉత్తమ్ అవివేకి లా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. హరీశ్ లేఖకు స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదని తెరాస నిర్ధారించిందని అడ్డగోలుగా ఉత్తమ్ మాట్లాడారు. ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు ఎజెండా నే కాంగ్రెస్ ఎజెండా అని ఉత్తమ్ చెప్పకనే చెప్పారు. అపుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతల మోచేతి కింద నీళ్లు తాగారు.
ఇపుడు చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజల కోసమే ఆ అపవిత్ర కూటమి ని ఎండగడుతున్నాం. తెలంగాణ ప్రజలు మహాకూటమి కి సరయిన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదికలు చెప్పాలని అన్నారు. కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీ కుట్రలను తెలంగాణ సమాజం ఆమోదించదు.
హరీశ్ రావు పన్నెండు ప్రశ్నలు ఏమున్నాయో కనీసం చదవకుండానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారని అన్నారు. ఉత్తమ్ అజ్ఞానానికి చింతిస్తున్నాం. మేం  గతంలో పెట్టుకున్న పొత్తులకు సిద్ధాంత ప్రాతిపదిక ఉంది. .నల్గొండ జిల్లా లో దామరచర్ల పవర్ ప్లాంట్ ను కోమటి రెడ్డి ,ఉత్తమ్ వ్యతిరేకించడం దారుణంమని అన్నారు. తెలంగాణ కు మేలు చేసే ప్రాజెక్టు ను వ్యతిరేకించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతామని అయన అన్నారు.
Tags:The letter is an anonymous: Corne Prabhakar:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *