హ‌నుమంతుని జీవ‌నం – స‌మ‌య పాల‌న‌కు అద్దం ప‌డుతుంది : డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ

తిరుమల ముచ్చట్లు :

 

ఆంజ‌నేయ‌స్వామివారి జీవ‌న విధానం స‌మ‌య పాల‌న‌కు అద్దం ప‌డుతుంద‌ని, నేటి యువ‌త ఆయ‌న ఆడుగుజాడ‌ల్లో న‌డిచి కాల‌న్ని చ‌క్క‌గా వినియోగించుకుంటే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌వ‌చ్చ‌ని ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాద‌నీరాజ‌నం వేదిక‌పై ” నేటి యువతకు ఆదర్శం హనుమ ” అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌న్య‌సిస్తూ నేటి యువ‌త సోమ‌రిత‌నం, మాన‌సిక ఆందోళ‌న‌, వ్య‌స‌నాల వ‌ల‌న కాలాన్ని వృధా చేయ‌కుడ‌ద‌న్నారు. గ‌తించిన జ‌లాన్ని తిరిగి ఎలా పొంద‌లేమో అదేవిధంగా ముగిసిన కాలాన్ని కూడా తిరిగి అందుకోలేమ‌న్నారు. ఆంజ‌నేయ‌స్వామివారి జీవితంలో దైర్యం, ఆలోచ‌న శ‌క్తి, వివేకం, సంయ‌మ‌నం ప్ర‌ధానంగా క‌నిపిస్తాయ‌ని, యువ‌త ఈ ల‌క్ష‌ణాల‌ను పుణికి పుచ్చుకుంటే వారి అభివృద్ధికి ఆకాశ‌మే హ‌ద్ధుగా నిలుస్తుంద‌ని తెలిపారు. యువ‌త మ‌న‌స్సు, వాక్కు, క‌ర్మల‌ను నిరంత‌రం స‌మీక్షించుకోవాల‌న్నారు.

 

 

 

హ‌నుమంతుడు సుగ్రీవున‌కు మంత్రిగా, శ్రీ‌రామ‌చంద్రామూర్తికి దూత‌గా, సీత‌మ్మ‌వారికి ఓదార్పు ప‌లికాడ‌న్నారు. అలాగే యుద్ధంలో నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన అద‌ర్శ‌వంతంగా నిలిచార‌న్నారు. యువ‌త ఆంజ‌నేయ‌స్వామివారి నిష్కామ‌ క‌ర్మ‌ను, ఆరోగ్య క‌ర‌మైన జీవ‌న విధానాన్ని నిరంత‌రం అవ‌లంబించాల‌న్నారు. త‌ద్వారా యువ‌త సాధించే విజ‌యాలు లోకంలో ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తాయ‌ని వివ‌రించారు.

ఆకాశ‌గంగ –

ఆకాశ‌గంగ వ‌ద్ద టిటిడి నిర్వ‌హిస్తున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా రెండ‌వ రోజైన శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి విశేష అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, అర్చ‌న నిర్వ‌హించారు.ఈ పూజా కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి పాల శేషాద్రి, ప్ర‌ముఖ పండితులు మ‌రియు టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  మోహ‌నరంగాచార్యులు, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి   బుల్లెమ్మ బృందం ఆంజ‌నేయ‌స్వామివారిపై సంకీర్త‌న‌ల‌ను ఆల‌పించారు.

జాపాలి –

జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి   పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. త‌రువాత అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు  ర‌ఘునాధ్ బృందం హ‌నుమ‌త్ స‌కీర్త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The life of Hanuman – a mirror to the rule of time: Dr. Achilles Vibhishana Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *