ఓటర్ల జాబితా పకడ్భందిగా తయారు చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలను పకడ్భంధిగా తయారు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో బిఎల్‌వో సెంటర్లను తహశీల్ధార్‌ సీతారామన్‌తో కలసి పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో 41 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పాటు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు , తొలగింపులు నిర్వహిస్తామన్నారు. నిబంధనల మేరకు బిఎల్‌వోలు పరిశీలన చేపట్టాలన్నారు. ఓటర్లుగా 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలన్నారు. అపోహాలకు తావులేకుండ జాబితాలను సిద్దం చేయాలన్నారు.

 

Post Midle

Tags: The list of voters should be prepared in full

Post Midle