యదేఛ్చగా కొనసాగుతున్న వన్యప్రాణుల వేట

Date:18/09/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వన్యప్రాణులను వేటాడుతున్నారు. కొందరు వేటగాళ్లు ఇదే పనిగా వన్యప్రాణులను హతమారుస్తూ వాటి మాంసాన్ని విక్రయించి, పబ్బం గడుపుతున్నారు. అడవుల్లో విద్యుత్ షాక్‌లను ఏర్పాటు చేసి, తాగునీటి కోసం వచ్చే వన్యప్రాణులను  వేటాడుతున్నారు.
అడవి జంతువుల మాంసానికి మార్కెట్‌లో అధిక ధరలు పలుకడం వలన  వేటగాళ్లు విచ్చలవిడిగా వన్యప్రా ణులను  వేటాడుతున్నారు.  అడవి జంతువులు వేటాడేందుకు ఏర్పాటు చే సిన విద్యుత్ షాక్‌లకు గురై గత ఏడాది కాలంగా 18 మంది ప్రాణాలను కోల్పోయారు.
అటవీ అధికారుల పర్యవేక్షణ  లోపం కారణంగా వేటగాళ్లు అటవీ ప్రాంతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వన్యప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నారు. జిల్లాలోని కోటపల్లి అడవుల్లో ఏకంగా  చిరుత పులిని సైతం వేటగాళ్లు  హతమార్చారు. ఈ సంఘటనతో కలవరం చెందిన అటవీ అధికారులు వేటగాళ్లపై కొద్ది రోజుల పాటు కన్నేసి ఉంచినప్పటికీ  ప్రస్తుతం పర్యవేక్షణ  కొరవడడంతో వేటగాళ్లు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటా డుతున్నారు.
తాజాగా రెండు రోజుల క్రితంచెన్నూర్ పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన సుంకరి శంకర్ ఇంటిలో రెండు దుప్పులకు సంబంధిం చిన తలలు, కాళ్లు,  వండిన  మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు అందిన ప క్కా సమాచారం మేరకు శంకర్ ఇంటిపై దాడి చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జన్నారం, దండేపల్లి, భీమిని, కొమురంభీం జిల్లాలోని కెరమెరి, తిర్యాణి, బెజ్జూర్, కౌటాల, వాంకిడి అటవీ ప్రాంతాల్లో కొందరు వేటగాళ్లు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నారు.
అంతే కాకుండా జన్నారం మండ లంలోని కవ్వాల్ అభయారణ్యంలో సైతం జంతువులను వేటాడిన సంఘటనలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలను తినేందుకు జంతువులు వస్తుండగా వాటి కదలికలను గుర్తించి వేటగాళ్లు విద్యుత్ షాక్‌లు అమర్చుతున్నారు.విద్యుత్ షాక్ తగిలి జంతువులు మృతి చెందిన వెంటనే వాటిని వాహనంలో వేసుకొని మాంసాన్ని పోగులుగా వేసి, ప్యాకెట్లలో నింపి మార్కెట్‌కు తరలించి అమ్మకాలు చేస్తున్నారు.
జంతువుల మాంసానికి మార్కెట్‌లో కిలోకు రూ. 900 నుంచి 1200 వరకు విక్రయాలు జరుపుతున్నారు. ప్రతి నిత్యం అటవీ ప్రాంతంలో జింకలు, కొండగొర్రె, మెకం, అడవి పందులను వేటాడుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కోటపల్లి మండలంలోని పిన్నారం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి పెద్దపులి మృత్యువాత పడి న సంఘటన అటవీశాఖ అధికారులను కలవరానికి గురి చేసింది.
పం ట పొలాల సమీపంలో అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ షా కులను అమర్చుతుండగా రాత్రి సమయాల్లో చేనుల వద్దకు వెళ్లే రైతులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలను కోల్పోతున్నారు.గత ఏడాది కాలంలో కోటపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కేవలం నెల రోజుల వ్యవదిలోనే 7 గురు రైతులు మృతి చెందడం కలకలంరేపింది. రైతులు మృతి చెం దిన సమయంలో సంఘటన స్థలానికి వెళ్తున్న పోలీసులు అటవీ అధికారులు కేవలం విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకుంటున్నారే త ప్పా వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదు.
వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నప్పటికీ అటవీ అధికారుల నిర్లక్షం వలన వే టగాళ్లు విచ్చల విడిగా జంతువులను వేటాడుతున్నారు. అడవి జంతు వుల ప్రాణాలను కాపాడాల్సిన అటవీ అధికారులు వేటగాళ్లకు పరోక్షం గా సహకరిస్తున్నట్లు సమాచారం.
ఏదిఏమైనా అటవీ అధికారులు ని మ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వలన వన్యప్రాణుల వేట యథే చ్ఛగా కొనసాగుతోంది. అటవీ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం నిఘా ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.
Tags; The long-running wildlife hunt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *