Natyam ad

ఐటీ దిగ్గజాల చూపు..ఏపీ వైపు

అమరావతి ముచ్చట్లు:

దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు
వచ్చాయి

Post Midle

1.ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

3,000 సీటింగ్‌ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది.

ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.

2.ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్‌.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది.

విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు.

3.వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది.

యాంకర్‌ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది.

 

 

 

4.ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌ ఆర్బిట్‌మాల్‌ షాపింగ్‌ మాల్‌తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది.

5.విజయవాడకు టెక్‌ మహీంద్ర

టెక్‌ మహీంద్రా తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తెలియజేశారు.

ఇప్పటికే విశాఖలో ఉన్న తాము విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్‌ చేశారు.

అంతకు ముందు దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్‌.. రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.

విజయవాడాలోని మేథా టవర్స్‌లో ప్రస్తుతం 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్యను 1,000కి చేర్చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది.

 

 

 

 

6.మరో ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్‌ కూడా విజయవాడలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 1,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలుత 200–300 సీటింగ్‌ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఇదే సమయంలో ఇండియాకు చెందిన అతి పెద్ద ఐటీ కంపెనీ ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

రాష్ట్రంలో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖ వేదికగా ఒక భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.

 

 

Tags: The look of IT giants..towards AP

Post Midle

Leave A Reply

Your email address will not be published.