అగ్రరాజ్యంలో కమలమే 

Date:16/11/2020

వాషింగ్టన్ ముచ్చట్లు:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ రికార్డు సృష్టించారు. భారతీయ, ఆఫ్రికా మూలాలున్న కమలా హారిస్ రంగంలోకి దిగడంతో ఎన్నిక స్వరూపమే మారిపోయింది. ఒక మహిళ ఇంతవరకు అగ్రదేశం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కాలేదు. ఒక్క హిల్లరీ క్లింటన్ మాత్రమే 2016లో అధ్యక్ష బరిలోకి దిగారు. ఆమె ఓడిపోయింది. ఇక ఉపాధ్యక్ష పదవికి ఇప్పటివరకు ఇద్దరు పోటీ చేసినప్పట్టికీ విజయం సాధించలేకపోయారు. తొలిసారిగా 1984లో గెరాల్డ్ ఫెరారో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పట్టికీ ఓటమి తప్పలేదు. 2008లో రిపబ్లికన్పార్టీ ఉపాధ్యక్ష్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సారా పాలిన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు కమలా హారిస్ మాత్రం రేసులో నిలిచి విజయం సాధించారు.కమలా హారిస్ భారత్, ఆఫ్రికా మూలాలున్న వ్యక్తి కావడం ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది. కమలా హారిస్ అభ్యర్థిత్వం ప్రకటనతో విరాళాలు పార్టీకి వెల్లువెత్తాయి, ఒక్కరోజులోనే పార్టీకి 26 మిలియన్ల డాలర్ల విరాళాలు రావడం ఆమె అభ్యర్థిత్వంపై ప్రజలకు గల క్రేజ్ కు నిదర్శనం. రెండు శతాబ్దాల స్వాతంత్య్ర చరిత్రలో ఇంతవరకు ఒక్క మహిళ అత్యున్నత పదవికి ఎన్నిక కాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ చరిత్రను కమలా హారిస్ అధిగమించారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు , ప్రవాస ఆఫ్రికన్ అమెరికన్లు కమలా హారిస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించడంతో అది జోబైడెన్ కు కూడా లాభించింది. ప్రవాసభారతీయులు, నల్లజాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్ లు డెమొక్రాట్ల వైపు నిలిచారు. ఒకరకంగా చెప్పాలంటే జోబైడెన్ విజయం వెనక కమలా హారిస్ ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. ఇలా కమలా హారిస్ అమెరికా ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన కమలా హారిస్ కుటుంబం అక్కడే స్థిరపడి చివరకు ఆమె అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారు.ఇక కమలా హారిస్ ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. భవిష్యత్ లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయి. ఆ అర్హతలు కమలా హారిస్ కు ఉన్నాయి. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్ష బరిలో ఉంటారని ఆమె అభిమానులు ఇప్పటి నుంచే చెబుతున్నారు. ఈ నాలుగేళ్లు ఆమె పడే కష‌్టమే కమలా హారిస్ ను వైట్ హౌస్ కు నడిపిస్తుందంటున్నారు. అదే జరిగితే అమెరికా అధ్యక్ష పీఠం అందుకున్న తొలి నల్లజాతి మహిళ గా కమలా హారిస్ రికార్డు సృష్టిస్తారు. మొత్తం మీద మన కమల అగ్రరాజ్యం లో ఎప్పటికైనా అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తుందని ఆశిస్తున్నారు.

సీఐ గంగిరెడ్డి జన్మదిన వేడుకలు

Tags: The lotus in the superpower

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *