కమలం కయ్యానికి దిగుతోందా

Date:20/01/2021

తిరుపతి ముచ్చట్లు:

బీజేపీ, జనసేన కలిసికట్టుగా ఉంటాయి.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థే బరిలోకి దిగుతారు అని ప్రకటించినా ఆ పార్టీ నేతలే ఇప్పుడు ‘నువ్వా..నేనా’ అంటూ కాలుదువ్వుతున్నారు. ఎవరంతకు వారే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వారి తీరు చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నటుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం మిత్రపక్షాల మధ్య అగ్గి రాజుకుంటోంది. తిరుపతి ఉపఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేనాలకు కోపోద్రిక్తుల్ని చేస్తున్నాయి.ఇటీవల దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో నిర్వహించిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో మిత్రపక్షాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించింది. అదే జరిగితే మిత్రభేదం తప్పదని.. ఎవరికి వారే బరిలోకి దిగాలని జనసేన నేతలు అంటున్నారు. ఈ విషయమై గురువారం తిరుపతిలో జరిగే జనసేన కీలక సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.తిరుపతిలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా.

 

 

లోపల మాత్రం అధికారికంగా తమ పార్టీ అభ్యర్థిని ఫైనల్‌ చేసినట్లు్ల విశ్వసనీయ సమాచారం. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం శ్రేణులంతా పనిచేయాలని పార్టీ కోర్‌ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి పరిధిలోని ప్రతి మండలానికి ఒక ప్రత్యే బృందాన్ని పంపి, ముఖ్యమైన వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఎన్నికలు ముగిసే వరకు తిరుపతిలోనే మాకం పెట్టాలని కసరత్తులు చేస్తోంది. వీటంనింటినీ చూస్తుంటే బీజేపీ అభ్యర్థే ఖారారైనట్లు తిరుపతి వాసులు చర్చించుకుంటున్నారు.నోటిఫికేషన్‌ వచ్చి క్షేత్రస్థాయిలో దిగేవరకు అభ్యర్థి ప్రకటన విషయాన్ని బయటపెట్టే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. కాకపోతే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నుంచి రావెల కిషోర్‌ బాబు రింగ్‌ దిగనున్నట్లు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయి.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

 

Tags:The lotus is descending to Kaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *