Natyam ad

ఎన్నికల వ్యూహాలు రచిస్తున్న కమల దళం.

హైదరాబాద్    ముచ్చట్లు:
 
భవిష్యత్లో రాబోయే ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. వేసవికి ముందే తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్తారని బీజేపీ అంచనాలు వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరుస సమావేశాలతో కమలనాథులు బిజీ బిజీ అవుతున్నారు. గత మూడు రోజులుగా జాతీయ సహాయ కార్యదర్శి శివ ప్రకాశ్ సహా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి..? ఏం చేయకూడదనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మొన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ క్లస్టర్ సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధిష్టానం.. నిన్న పదాధికారాలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. నేడు బర్కత్ పుర బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ క్లస్టర్ సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఒకవైపు చేరికలపై ఫోకస్ చేస్తూనే.. పార్టీ నేతలు ఏం చేయాలనే అంశాలపై బండి సంజయ్, శివ ప్రకాశ్పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద స్థాయి నేతల చేరికలు రాష్ట్ర అధిష్టానం చూసుకుంటుందని, నాయకులు, కార్యకర్తలు చేయాల్సిందల్లా బూత్ స్థాయిలో ఇతర పార్టీల నేతలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో కష్టపడి పనిచేసినా గుర్తింపు దొరకని, అసంతృప్తిగా ఉండే నేతలపై నజర్ పెట్టాలని వారు సూచించినట్లు పలువురు నేతలు చెబుతున్నారు. కొత్త నీరు వస్తే.. పాత నీరు పోతుందనే భయం ఎవరికీ అక్కర్లేదని రాష్ట్ర అధిష్టానం సూచించింది. కొత్తవాళ్లు చేరినా, చేరకపోయినా ఇన్నాళ్లు నమ్ముకున్న పార్టీకి మనమేం చేశామనేదే ముఖ్యమని, పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడ్డామకనేదే ముఖ్యమని రాష్ట్ర అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు, వారిని నమ్ముకున్న నేతలను బీజేపీ వైపునకు లాగాలని వారిపై ప్రధానంగా దృష్టి సారించాలని అధిష్టానం సూచించింది.రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే ఈ దూకుడు సరిపోదని, మరింత స్పీడ్పెంచాలనే యోచనలో రాష్ట్ర అధిష్టానం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు ఆదేశించింది. అలాగే బీజేపీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయితేనే గ్రామస్థాయికి చేరుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై పోరాడటంతో బీజేపీ వెనుకబడిందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంతో మోర్చాలు కీలకంగా వ్యవహరించాల్సిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. బీజేవైఎం మినహా ప్రజా సమస్యలపై ఇతర మోర్చాల పనితీరు అద్వానంగా ఉందనే యోచనలో రాష్ట్ర అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ సహాయ కార్యదర్శి శివ ప్రకాశ్ ఇటీవల జరిగిన సమావేశంలో మోర్చాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విభాగాల వారీగా మోర్చాలు సమస్యలను లేవనెత్తకుండా తూతూ మంత్రంగా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల కోసం అందరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధిష్టానం నిర్ణయించింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. తెలంగాణలో మరోసారి అధికారమే లక్ష్యంగా ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ టీమ్ను ముఖ్యమంత్రి కేసీఆర్రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అలాగే కాం
గ్రెస్ సైతం పీకే శిష్యుడు సునీల్ కుమార్ సేవలను ఉయోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ మాదిరిగా వ్యూహకర్తలపై ఆధారపడకుండా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ను నిర్ణయించుకొని ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పూర్తి ఫోకస్తెలంగాణపై పెట్టనుంది. ఇది పూర్తయ్యాక రాష్ట్రానికి జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల క్యూ పెరుగుతుందని శ్రేణులు చెబుతున్నాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీజేపీ సమీక్షలు, ప్రణాళికలు చేస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని బీజేపీ అంచనాలు వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగాలని కమలనాథులు భావిస్తున్నారు.
Tags;The lotus troop that is formulating election strategies