ప్రజా సమస్యలను  పరిష్కరించడమే  ప్రధాన లక్ష్యం- డివిజన్ ఇంచార్జి రామ్మోహన్

నెల్లూరు ముచ్చట్లు :

 

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 2వ డివిజన్ గుడిపల్లిపాడు గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్థానిక డివిజన్ ఇంచార్జి, వైకాపా నాయకులు పగిడినేటి రామ్మోహన్ పేర్కొన్నారు. గుడిపల్లి పాడు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి , నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ,నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారమే  తన ప్రధాన లక్ష్యంగా  తన వంతు బాధ్యతాయుత విధుల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామంలో  ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో   విద్యుత్ అంతరాయం ఏర్పడింది అన్నారు. ఈ క్రమంలో మీరు లేక క పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న డివిజన్ ప్రజలకు తన వంతు సహకారం అందించాలని అదే తన ఆశయం అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం కారణంగా  నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్స్ నీళ్లు తెప్పించి ,ప్రతి కాలనీ కి పంపించి, నీటి కొరత  తీర్చేందుకు తన వంతు కృషి చేయడం జరిగినది అని తెలిపారు. సంబంధిత విద్యుత్ ఏ. ఈ తో  మాట్లాడి, వెంటనే ట్రాన్స్ఫార్మర్ పునరుద్దరించి ,ప్రజల సమస్యను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. విషయమై 2వ డివిజన్ స్థానిక ప్రజలు, డివిజన్ ఇంచార్జి రామ్మోహన్ సేవలు అభినందనీయమని ఆయన సేవలను కొనియాడారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The main objective is to solve public problems – Division In-Charge Rammohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *