శిధిలావ్యవస్థకు చేరుకున్న ప్రధాన రహదారి

ఆచంట ముచ్చట్లు:

 

పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంట నియోజకవర్గం పరిధిలో ఉన్న  పెనుగొండ ప్రధాన రహదారి శిధిల వ్యవస్థకు చేరుకుని ప్రయాణికులు పాలిట శాపంగా మారింది. పెనుగొండ ప్రధాన  రహదారిని 2012 -2013 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం సుమారు నాలుగున్నర కోట్లతో వన్ వేను టువేగా వేయడం జరిగింది. వేసిన కొన్ని నెలలో రోడ్డు పూర్తిగా శిధిల వ్యవస్థకు చేరుకుంది. అప్పటి నుండి  ఆ రహదారికి మరమ్మత్తు పనులు చేస్తామని ప్రతి సారి  సుమారు 8 లక్షల నుండి 10 లక్షలు పెట్టి  తూ తూ  మంత్రంగా రోడ్డుకు మర్రమత్తులు   వేసి చేతులు  దులుపుకుంటున్నారు  అధికారులు .మార్టేరు నుండి పెనుగొండ వెళ్లాలంటే పది నిమిషాలు సమయం పడుతుంది, ఇపుడు ఆ రోడ్డు సరిగా లేకపోవడం తో 40 నిమిషాలు సమయం పడుతుంది. రోడ్డు బాగా గొతుకులతో ఉండడం తో ఎమర్జెన్సీ 108 వాహనాలో  పేషంట్ లను సమయానికి హాస్పిటల్ కి అడ్మిన్ చేయలేకపోవడం కూడా పరిస్థితి ఏర్పడింది. అనేక మంది అదే రోడ్డులో మృత్యు వాతకు  బలైపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెనుగొండ రహదారిని  పటిష్టంగా వేసి  ప్రయాణికుల ప్రాణాలను కోల్పోకుండా  గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాహన ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: The main road leading to the ruins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *