భవిష్యత్తులో ప్రధాన పాత్ర గృహసారధులదే- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-హామిలు అమలు చేసి ప్రజల వద్దకు
-చంద్రబాబు ఎందుకు చేయలేదు
పుంగనూరు ముచ్చట్లు:
భవిష్యత్తులో గృహసారధులు, కన్వీనర్లు ప్రజలకు చైతన్యం కలిగించడం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను వివరించడంలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో జరిగిన గృహసారధులు, కన్వీనర్ల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు అతిధులుగా పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత నెలలో మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జయప్రదమైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామిలను 98.44 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం 600 హామిలు ఇచ్చి ఒక్కటి కూడ నేరవేర్చలేదన్నారు. కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టివి5, ఏబిఎన్ ఛానల్స్ అభూత కల్పనలతో చంద్రబాబును పొగడటం జరుగుతోందన్నారు. జన్మభూమి కమిటిలు దోచుకుతిన్నాయన్నారు.
చంద్రబాబు వైఎస్. జగన్‌లా ఎందుకు పని చేయలేదని నిలధీశారు. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్యమంత్రులు , ప్రజాప్రతినిధులు పథకాలు అందించేవారన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని పథకాలను అమలు చేసి , అన్ని వర్గాలను ఆదుకుని, దైర్యంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు అవకాశం కల్పించారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతి తరువాత ఆరోగ్యశ్రీ కనుమరుగు చేశారన్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీలో రెండువేల జబ్బులను కలిపి రూ.1000 లనుంచి లక్షల వరకు వైద్యం ఖర్చులు అందించడం , బయట ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు తీసుకుని, విశ్రాంతి తీసుకునే సమయంలో కూడ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను గృహసారధులు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులతో కలసి వివరించి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
30 ఏళ్ల కుటుంబం ఏమి చేసింది…
ముప్పె ఏళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పని చేసిన ఒకే కుటుంబం పుంగనూరును ఏమి అభివృద్ధి చేసిందని మంత్రి పెద్దిరెడ్డి నిలధీశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారుమూల గ్రామాలకు రోడ్లు, కాలువలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య తీర్చేందుకు నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రెండు రిజర్వాయర్లు నిర్మించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని స్పష్టం చేశారు.
Tags: The main role in the future is for householders – Minister Peddireddy Ramachandra Reddy