బస్సులో వ్యక్తి మృతి

గూడూరు ముచ్చట్లు:
 
తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గూడూరు లో  చోటు చేసుకుంది.    తడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో మృతి చెందిన ఆ వ్యక్తిని 46 ఏళ్ల పువన్ గా గుర్తించారు.  ఇతను తడ లో బస్సు ఎక్కి గూడూరు వరకు టికెట్ తీసుకున్నట్టు కండక్టర్ తెలిపారు. భోపాల్ కు చెందిన వాడు  శ్రీ సిటీలోని ఏదైనా పరిశ్రమ లో పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.  అతని వద్ద ఉన్న ఆధారాలను బట్టి పువన్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకునే నిమిత్తం ప్రయాణిస్తున్నారు.  గూడూరు పట్టణానికి సమీపంలోకి వచ్చేసరికి కండక్టర్  దిగాల్సిన ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.  అయితే పువన్ నిద్రిస్తున్నాడనుకొని భావించిన కండక్టర్ అతనిని తట్టి లేపగా అప్పటికే మృతి చెందారు. గూడూరు ఆర్ టి సి ప్రాంగణంలో నిలిపి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; The man on the bus died

Natyam ad