వాటర్ ట్యాంక్ పై వ్యక్తి వీరంగం

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరులోని గొల్లయగూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి వీరంగం సృష్టించాడు. రెండు గంటలుగా కిందకు దింపేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేసారు. మద్యం బాటిల్ కావాలని, సీఎం జగన్ రూ.10 లక్షలు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి డిమాండ్ చేసాడు. మద్యం బాటిల్ ఇస్తాం,  సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కిందకు దిగలేదు. కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై రాళ్లూ రువ్వాడు.  పోలీసులే స్వయంగా మద్యం బాటిల్ తెచ్చి ఇవ్వగా ట్యాంక్ పైనే మద్యం సేవించిన వ్యక్తి, సీఎం జగన్ రూ.10 లక్షలు ఇవ్వాలంటూ పోలీసులను డిమాండ్ చేశాడు.  స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా,  పెదపాడు మండలం వెంకటాపురం పంచాయతీకి చెందిన దుర్గారావు అనే వ్యక్తిగా భావిస్తున్నారు.

 

Post Midle

Tags: The man on the water tank is Veeranga

Post Midle