తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడు

Date:03/05/2020

ప్రకాశం ముచ్చట్లు:

పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తంగిరాలపల్లిలోని ఎస్సీ కాలనీలో తండ్రిని కుమారుడు అతిదారుణంగా హత్య చేశాడు. పనుల్లేక ఇంట్లో ఉన్న కుమారుడిని తండ్రి మందలించడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు తండ్రి హతమార్చాడు. తండ్రీకొడుకుల మధ్య మాటా మాటా పెరగడంతో కుమారుడు తండ్రి తలపై రోకలి బండతో కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన తండ్రి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ఇకపై కష్టతరం కానున్న వెంకన్న దర్శనం? 

Tags: The man who killed his father with a toothpick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *