ఏకాంతంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వరుడి కళ్యాణం

తిరుపతి ముచ్చట్లు :

 

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఏకాంతంగా జరిగింది.సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్  గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: The marriage of Sri Prasanna Venkateswara in solitude

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *