Date:15/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో పెళ్లయిన కూతురు కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు.మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం లో కొడుకును ఏవిధంగా నైతే భాగస్వామిగా చూస్తారో పెళ్లయిన కూతురిని కూడా అదేవిధంగా చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లయిన కూతురిని కుటుంభం లో సభ్యురాలిగా భావించరాదంటూ ప్రయాగరాజ్ జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాస్తవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునీర్ ధర్మాసనం పై విధంగా స్పష్టం చేసిందని హరి అశోక్ కుమార్ ఉద్యోగుల కుటుంబాల సమాచారం కోసం తెలిపారు.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags:The married daughter deserves it.