పవన్ పోరాటంలో అర్థం ఉంది: చంద్రబాబు

The meaning of Pawan's struggle is: Chandrababu

The meaning of Pawan's struggle is: Chandrababu

Date:15/02/2018
అమరావతి ముచ్చట్లు:
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఏసీతో తెలుగుదేశానికి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. పవన్ పోరాటంలో అర్థం ఉందన్న చంద్రబాబు…, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో పవన్ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఉద్దేశం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనేనని…  శ్వేత పత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.   కేంద్రం ఏం చేసిందనే శ్వేతపత్రం బీజేపీ ఇవ్వాలన్నారు. కాగితంపై పెట్టిన 27 పేజీల లెక్కలు చెప్పారే తప్ప, ఎంత మంజూరు చేశారో చెప్పలేదన్నారు.పవన్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ)తో మనకు ఇబ్బంది లేదని చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పవన్ పోరాటంలో అర్థం ఉందన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో పవన్ వెళ్తున్నారని పేర్కొన్నారు. తనకు తోచిన విధంగా పవన తన పద్దతిలో వెళ్తున్నారని తెలిపారు. మన ఉద్దేశమూ కూడా రాష్ట్రానికి మేలు జరగాలనే కదా అన్నారు.
Tags: The meaning of Pawan’s struggle is: Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *