మీడియా క్షమాపణ చెప్పాలి : రేవంత్ రెడ్డి

The media apologize: Revant Reddy

The media apologize: Revant Reddy

Date:06/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నాపై ఐటీ రైడ్స్ సందర్బంగా  కొన్ని టీవీలు, పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తల ఆధారంగానే మొన్న నాపై ఐటీ అధికారులు నాలుగు, ఐదు గంటలపాటు వేదించారు. ఆ చానల్స్,  పత్రికలు వేంటనే అవి తప్పుడు వార్తలని వివరణ ఇవ్వాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  క్షమాపణ చెప్పకపోతే, పరువునష్టం కేసు వేస్తా. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అయన అన్నారు.
ఉద్యమ సమయంలో తప్పుడు వార్తలు ప్రసారంల్లో కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్,  కవితలపై ఉన్న కేసులే ఉపసంహరించారు. ఎందుకు ఉద్యమకారుల కేసులు ఉపసంహరించలేదని అయన ప్రశ్నించారు.  ఉద్యమకేసుల వల్ల అనేక మంది యువత ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు కల్లు  తాగిన కోతికి తేలు కుడితే ఎలా ఎగురుతుందో, అలా ఎగురుతున్నాడని అయన విమర్శించారు.
ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు లాగా చిత్రింకరించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుకు కనీసం ఇక్కడ ఓటు కూడా లేదు. మరోసారి సెంటిమెంట్ తో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు కాంగ్రేస్ వర్సెస్ టిఆర్ఎస్ అనేదాన్ని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ టిడిపి పార్టీ లో ఉన్నవారు తెలంగాణ బిడ్డలు కాదా అని అయన అన్నారు. సీఎం గా ఉండి నీచమైన విమర్శలు చెయ్యడానికి.సిగ్గుందాలి.
ఆంద్రా కాంట్రాక్టర్స్ వద్ద మొకరిల్లినప్పుడు, ఆంధ్ర అని తెలియదా అని అడిగారు. నాలుగేళ్లలో ఏమీ చేయలేదని చెప్పేందుకు ఏమీ లేదని .. చంద్రబాబు టార్గెట్ తో తెలంగాణ సెంటిమెంట్  రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ లాంటి ఆధముడు, సీఎం కుర్చీలో కూర్చునేందు అనర్హుడని వ్యాఖ్యానించారు.
ఓటుకు నోటు కేసు గురించి పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్ నన్ను ఏమి చేసుకుంటాడో చేసుకోమానండని అన్నారు. నన్ను దాటకే,  చంద్రబాబు వద్దకు వెళ్ళాలి కదా అని అన్నారు.. పొత్తు కోసం చంద్రబాబు ఐదు కోట్లు,  మూడు హెలిక్యాపటర్స్ పంపాడంటున్న కేసీఆర్,  నీవు టీడీపి పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నావో ముందు లెక్క చెప్పాలని అన్నారు.
ఆంధ్రావాళ్ళు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్ కు అమరావతి వెళ్లి నప్పుడు అది గుర్థుకు రాలేదా అని నిలదీసారు. కమ్మవాళ్లను విమర్శిస్తున్న కేసీఆర్ కు తన పార్టీలో కమ్మ వాళ్లకు టికెట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు గుర్తులేదా అని అన్నారు.
Tags:The media apologize: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *