సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి

The membership registration program should be accelerated

The membership registration program should be accelerated

Date:16/11/2018

పలమనేరు ముచ్చట్లు:

తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పలమనేరు మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్ నాయుడు ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు. మండల పార్టీ సాధారణ సమావేశం మంత్రి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  జగదీశ్ నాయుడు మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఉన్న బూత్ కన్వీనర్లు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అన్ని పంచాయతీలలో ఉన్న బూత్ కన్వీనర్లకు పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శలు కు దిశానిర్దేశం చేశారు. గతంలో కంటే ఈసారి 40 శాతం అధికంగా చేయాలని వారు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి కమిటీ చైర్మన్ బాలాజీ నాయుడు , సుబ్రమణ్యం నాయుడు, ఎంపీపీ గీత, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లీశ్వర్ రెడ్డి, నాయకులు కవీంద్ర నాయుడు, జయప్రకాష్ రెడ్డి,మంజుల రెడ్డి, బాలాజీ, స్వతంత్ర బాబు రామచంద్ర నాయుడు, నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల గోడౌన్ ను  తనిఖీ చేసిన దానకిషోర్

Tags:The membership registration program should be accelerated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *