నిలిచిపోయిన మెట్రో రైలు…ప్రయాణికుల అందోళన

The metro train that was stopped was ... passenger shouting

The metro train that was stopped was ... passenger shouting

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
శనివారం ఉదయం మెట్రో ప్రయాణికులు చుక్కలు చూసారు.  మియాపూర్ – అమీర్పేట మార్గంలోని బలానగర్ అంబెదక్కర్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. బాలానగర్ అంబేద్కర్ స్టేషన్లో మెట్రో రైలు నిలిచిపోయింది. కరెంటు సరఫరా లేనందు వల్లే రైలు నిలిచిపోయిందని మెట్రో సిబ్బంది చెప్పారు. మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు.
అసలు విషయాన్ని ప్రయాణికులకు చెప్పని మెట్రో సిబ్బంది వారికి టికెట్లు ఇచ్చి ప్లాట్ ఫాం మీదకు పంపారని ఆరోపించారు. తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంట నుంచి ఉన్నారైలు రాకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మళ్లీ ఎప్పుడు రైళ్లను పునరుద్ధరిస్తారన్న విషయమై మెట్రో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంలో ప్రయాణికులు మరింత అందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ, పోలీసులు ప్రయాణికులకు సర్ది చెప్పారు. ఈ సాంకేతిక సమస్య నేపథ్యంలో మిగతా రూట్లలోని మెట్రో సేవలకు కూడా అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Tags: The metro train that was stopped was … passenger shouting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *