కె.విశ్వనాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి చెల్లుబోయిన
విజయవాడ ముచ్చట్లు:
కళా తపస్వి, దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ, సమాచార మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు…భారతీయ సంస్కృతిక సంప్రదాయాలను, సంగీత సాహిత్యలను తన సృజనాత్మకమైన మార్క్ తో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారని మంత్రి అన్నారు…ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడంతో పాటు 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు….ఆయన దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం అనే మొదటి సినిమా ఆరోజుల్లో నంది అవార్డు దక్కించుకుందని….ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైళ్ళ రాళ్ళని మంత్రి తెలియజేశారు… అలాంటి దర్శక దిగ్గాజాన్ని కోల్పవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటని మంత్రి అన్నారు…ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటూ…వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు..
Tags; The minister expressed shock at the death of K. Vishwanath

