సీఎం సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
నగరి ముచ్చట్లు:
ఈనెల 28న విద్యా దీవెన లాంఛనంగా ప్రారంభించడానికి నగిరి పట్టణానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్నడంతో దానికి సంబంధిత ఏర్పాట్లను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా లు జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.నగిరిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగరి పర్యటనఈ నేపద్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమం లో పాల్గొన్న డిప్యూటీ సిఎం కె. నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఏంఎస్ బాబు, ఎమ్మెల్సీ భరత్, కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి తదితరులు.ముందుగా సభ నిర్వహించే ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .అనంతరం ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Tags:The ministers examined the arrangements of the CM’s chamber
