కనిపించకుండా పోయిన మహిళ  అనుమానస్పదంగా మృతి

Date:17/10/2020

వికారాబాద్  ముచ్చట్లు:

వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన సాయమ్మ(48) ఈనెల 12 నాడు కోట్ పల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వారం రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిసింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వినాయక విగ్రహాల తయారి షెడ్ లో గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాజశేఖర్ సిబ్బందితో పాటు క్లూస్ టీం, జాగీలాలను తీసుకొచ్చి అనవాళ్లు సేకరించారు. మృతి చెందిన మహిళ తప్పిపోయిన సాయమ్మగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం శవాన్ని ఆసుపత్రికి తరలించారు. అనుమానంగా మృతి చెందిన మహిళ సాయమ్మ నే నని డీఎస్పీ సంజీవరావు తెలిపారు.

చిన్న‌శేష వాహ‌నంపై దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tags; The missing woman died suspiciously

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *