Natyam ad

 అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయడమే ప్రభుత్వ ధ్యేయం

— నూతన పెన్షన్లు పంపిణీలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

–387 మందికి  కొత్త గా మంజూరు

— మంజూరు పత్రంతోపాటు  స్వీట్‌ బాక్స్ పంపిణీ

Post Midle

— మండలాన్ని అభివృద్దిచేశాం ఆదరించండి

చౌడేపల్లె ముచ్చట్లు:

రాజకీయాలకు, కులాలకు  అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు  చేసి ఆర్థిక భరోసా కల్పించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం  చౌడేపల్లె ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో జెడ్పిటీసీ సభ్యుడు ఎన్‌. దామోదరరాజు ఆధ్వర్యంలో  ఎంపీపీ రామమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన  నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం  జరిగింది. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ   ఎన్నికలకు ముందు పాదయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉండి 60 సంవత్సరాలు  నిండిన అవ్వ, తాతలతోపాటు, అర్హతను బట్టి వితంతు,వికలాంగులు,అభయహస్తం, ఒంటిమహిళ, చర్మకారులు, డప్పుకళాకారులు, మెడికల్‌ కేసులు, ఫిషరీస్‌ కులస్తులకు ప్రతినెలా ప్రభుత్వం పెన్షన్లు ఒకటో తారీఖున వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో 6109 మంది లబ్దిదారులకు రూ:1.54 కోట్ల రూపాయాలను ప్రతినెలా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు  ఆగస్ట్రు నెలనుంచి 387 మంది నూతన లబ్దిదారులకు రూ:10.03 లక్షలు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అర్హులకు లబ్దిచేకూరుస్తోంద ని గుర్తుచేశారు.ప్రజలు సేవ చేయడంతోపాటు ఆదరిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

అభివృద్దికి ఓటెయ్యండి….. మండలంలోని ప్రతి గ్రామానికి  తారు, సిమెంటు రోడ్లు ను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి. మిథున్‌రెడ్డిల సహకారంతో వేయించామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో అర్హత ఉన్నవారికి పెన్షన్లు, ఇండ్లు, పలు వసతులు, తోపాటు అనేక భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. అభివృద్దిను చూసి రాబొయే ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీ మెంబర్లు సిఫార్సుచేసిన వారికి మాత్రమే పెన్షన్లు మంజూరయ్యేవన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక అర్హతను బట్టి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.  ప్రజాధారణను చూసి ఓర్వలేక టిడిపి నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని , వారికి గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం  చెప్పినా ఇంకా బుద్దిరాలేదన్నారు. అనంతరం లబ్దిదారులకు పెన్షను మంజూరు  పత్రంతోపాటు  జెడ్పిటీసీ దామోదరరాజు సహకారంతో387 మంది లబ్దిదారులకు ఒకొక్క  స్వీట్‌ బాక్స్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ ముని తుకారం, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీలు అంజిబాబు,రుక్మిణమ్మ, వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కో ఆప్షన్‌మెంబరు సాధిక్‌భాషా, ఎంపీడిఓ సుధాకర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

 

 

Tags: The mission of the government is to grant pensions to all the deserving ones

 

Post Midle