ఎమ్మెల్యేలకు పోమ్మనకుండా పోగబెడుతున్నారు…

Date:19/09/2018
విజయవాడ ముచ్చట్లు :
మ‌రో ఏడెనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి.. మ‌ళ్లీ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ప్రతి సీటును ఆయ‌న ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవ‌లం గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా బ‌ల‌మైన నేత‌లను ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నిర్వహించిన దాదాపు 20 స‌ర్వేల‌లో వ‌చ్చిన ఫ‌లితాల‌ను క్రోడీక‌రించి సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో నిర్ణయం తీసుకోవాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు.అయితే, సిట్టింగుల‌కు టికెట్ ఇవ్వక‌పోతే.. వారేమైనా రెబ‌ల్స్‌గా మారే ప్రమాదం ఉందేమోన‌నే ఆందోళ‌న కూడా చంద్రబాబులో క‌నిపిస్తోంది.
దీంతో ఆయా ఎమ్మెల్యేల‌ను త‌న వ‌ద్దకు పిలిపించుకుని వారి జాత‌కాల‌ను వారికే చెప్పి.. వారి నోటితోనే `టికెట్ వ‌ద్దులే` అనిపించేలా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేలతో సుమారు పదిహేను నిముషాల సేపు సీఎం మాట్లాడుతున్నారు. వారి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీలో ఆ ఎమ్మెల్యేకు ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి..
ఎందుకు వచ్చాయి.. వాటిని ఎలా సరిచేసుకోవాలి తదితర విషయాలను కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు.అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అంశాలను పూసగుచ్చుతున్నారు. తనకు అందిన సర్వేల నివేదికల నుంచి ఈ విషయాలన్నీ ఒక్కచోట క్రోడీకరించి సదరు ఎమ్మెల్యేలని ముఖాముఖీ కడిగేస్తున్నారు చంద్రబాబు.
ఇటీవల కోస్తా జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే ముఖాముఖికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు పనితీరును 76 శాతం మంది మెచ్చుకోగా, ఎమ్మెల్యే పనితీరును కేవలం 22 శాతం మంది మాత్రమే బాగుందని చెప్పారన్న నిర్ధిష్ట సమాచారం సీఎం వద్ద అప్పటికే ఉంది. దీనిపై చంద్రబాబు ఆ ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నించారు. స్థానిక పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. ఈ సమాచారం విన్న ఎమ్మెల్యే కొద్దిసేపు ఆశ్చర్యపోయారు.
తన నియోజకవర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని దబాయించే ప్రయత్నం చేశార‌ట‌.దీనిపై బాబు అంతే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే నా పనితీరుపై 76 శాతం మంది ఎలా సంతృప్తి ఎందుకు వ్యక్తంచేస్తారని నిలదీశారు. “నువ్వు నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నావు” అని కూడా సీఎం ప్రశ్నించారు.
మొత్తంగా ఇది ఒక్క ఎమ్మెల్యేకు ఎదురైన అనుభ‌వం అనుకుంటే పొర‌పాటే.. దాదాపు గెలుపు గుర్రాలు కాని వారి ప‌రిస్థితి చంద్రబాబు వ‌ద్ద ఇలానే ఉంద‌ని అంటున్నారు తెలుగు దేశం సీనియ‌ర్లు. మొత్తానికి ఇలాంటి వారు చాలా మందే ఉన్నార‌ని, వీరిని తెలివిగా వ‌దిలించుకుంటున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:The MLAs are being unwrapped …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *