The MLA's mission is to design infrastructure

మౌళిక సదుపాయాల రూపకల్పనే ఎమ్మెల్యే ధ్యేయం

Date:05/08/2020

రామసముద్రం ముచ్చట్లు:

మౌళిక సదుపాయాల రూపకల్పనే మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ధ్యేయమని కెసిపల్లె వైకాపా నాయకులు దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని వనగానిపల్లి నుండి మిట్టయంబాడికి వెళ్లే మార్గం గోతులు పడడంతో ఓ మోస్తారు వర్షం కురిసిన రోడ్డు మొత్తం చిత్తడిగా మారిపోతుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తేవడంతో ఆయన స్పందిస్తూ గోతులకు మట్టి వేయాలని ఆదేశించారు. దీనితో బుధవారం రోడ్డుపనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా కంకణం కట్టుకున్నారన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ సీసీరోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించరన్నారు. కొన్ని సంవత్సరాలుగా గోతుల రోడ్డు గుండా ప్రయాణం నరకయాతన ఉన్న మార్గానికి మట్టి వేయడంతో జోగిండ్లు, మిట్టయంబాడి ప్రజలు ఎమ్మెల్యే నవాజ్ భాషకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లారెడ్డి, బాబు, జయప్ప, వాలింటర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలి

Tags: The MLA’s mission is to design infrastructure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *