Date:26/11/2020
హైదరాబాద్ ముచ్చట్లు:
కార్మికులు, రైతులు, సామాన్య ప్రజానీకం, కష్టజీవుల సంక్షేమం వదిలి పెట్టుబడిదారుల కొమ్ము కాయటానికి, వారికి లాభం చేకూర్చడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉవిళ్లురూతుందని ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు చెందిన సౌత్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలకు భారతదేశ కార్మకవర్గం నేడు చేపట్టిన సమ్మె విజయవంతం అయింది. జాతీయ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే. సమ్మెలో లక్షలాదిమంది కార్మికులు పాల్గొన్నారు. అఖిల భారత బీమా ఉద్యోగుల సమాఖ్య జోనల్ ఆఫీసు ఎదుట ఎల్ఐసీ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి పి. మహేష్, జోనల్ ప్రధాన కార్యదర్శి వి. రఘునాథన్ ప్రసంగించారు.
మోదీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాలు అమలు చేస్తూ దేశాన్ని సంక్షోభంలోకి, ప్రజలను మరింత దారిద్య్రంలోకి నెట్టేస్తుందన్నారు. అప్రజాస్వామికంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పార్లమెంట్చే ఆమోదముద్ర వేయించుకొందన్నారు. పెద్ద సంఖ్యలో అసంఘటిత కార్మికులు, కార్మిక చట్టాల పరిధి నుండి మినహాయించబడ్డారు. ఎల్ఐసీ, ఆర్బీఐ, ఇతర ప్రభుత్వ ప్రజారంగ సంస్థలను ఏటీఎంలాగా వాడుకుంటూ వాటిని వేలం వేయటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రజా రవాణా అయిన రైల్వేలోను, లాభాలు పంచే బొగ్గు గనులలోను, ఇంధన కంపెనీ బి.పి.సి.ఎల్ 41 యుద్ధసామాగ్రి తయారుచేసే కర్మాగారాలు, రైల్వేలకు కావాల్సిన ఉత్పత్తుల కర్మాగారాలలోను ఓడరేవులు, ఓడల నిర్మాణ కేంద్రాలలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిందన్నారు.
ప్రైవేణీకరణ వ్యతిరేకించినందుకు బీఎస్ఎన్ఎల్ కార్మికులను దేశద్రోహులని ముద్రవేసి నిందించిందన్నారు. ఎల్ఐసీని పాక్షికంగా అమ్మేయ తలపెట్టడం జాతి ప్రయోజనాలకు విఘాతం అన్నారు. దేశ నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలలో ఎల్ఐసీ ప్రధానపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. సమ్మె సందర్భంగా పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. జాతీయ కార్మిక సదస్సు కోర్కెల పత్రానికి మద్దతు తెలిపారు. ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు చేయాలన్నారు. ఎల్ఐసీ కొత్త పెన్షన్ స్థానంలో 1995 సంవత్సరపు పాత పెన్షను విధానం ప్రవేశపెట్టాలన్నారు. 2017 నుండి జరగవలసిన జీతభత్యాల సవరణ వేగంగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
నివర్ తుఫానుతో దక్షణాది అతలాకుతలం
Tags: The Modi government is horning in investors