మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

-సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గనిసెట్టి  సత్యనారాయణ డిమాండ్

Date:16/01/2021

విశాఖపట్నం ముచ్చట్లు:

మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తాడి గ్రామంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఎముకలు కొరికే చలిలో ప్రాణాలు కోల్పోయిన రైతులు ప్రాణాలు వృధా కావని మోడీ ప్రభుత్వం తొమ్మిది సార్లు రైతులతో చర్చలు చేసి  ఏ విధమైన ఉపయోగకరమైన చర్చ జరగలేదని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ  దేశంలో కోటి ఇరవై లక్షల మంది ఆందోళన చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు తప్ప పేద రైతు కష్టజీవులు సమస్యలు పట్టడం లేదని అన్నారు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు మార్పులు తీసుకొచ్చి యాజమాన్యాలకు అనుకూలంగా చేయడం దుర్మార్గమన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చడం దుర్మార్గమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జి నూకరాజు జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: The Modi government should repeal anti-farmer laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *