ఎల్‌ రమణ టీఆర్‌ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యేందుకు ముహుర్తం ఖరారైంది. రేపు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని ఎల్‌. రమణ తీసుకోనున్నారు. రమణకు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవ్వనున్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా నా ఎదుగుదలకు సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు’అని చంద్రబాబుకు పంపిన ఆ లేఖలో ఎల్‌.రమణ తెలిపారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: The moment has come for L Ramana to join the TRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *