జూన్ మొదటి వారంలో కేరళను తాకనున్న రుతుపవనాలు

Date:15/04/2019
తిరువనంతపురం ముచ్చట్లు :
రైతన్నలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 2019 వాతావరణ అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. సుమారు 96 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వెల్లడించింది.  130 కోట్ల మంది భారతీయులకు అన్నం పెడుతున్న కర్షకులకు ఈసారి వానలు బాగానే పడతాయంటూ సమాచారం అందించింది. రాబోయే వర్షాకాలంలో దాదాపు సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని స్పష్టం చేసింది. జూన్-సెప్టెంబర్ నెలల మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ నాలుగు నెలల్లో దేశంలో సగటున 89 సెం.మీ. వర్షం కురుస్తుంది. రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైతే.. అది రైతాంగానికే కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. దేశంలో నమోదయ్యే వర్షపాతంలో 70 శాతం వాటా నైరుతి రుతుపవనాలదే కావడ గమనార్హం. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ వేసవిలో ఎల్ నినో ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే తక్కువ వర్షపాతం నమోదై కరవు సంభవిస్తుంది. కానీ భారత్‌లో ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండదని, వేసవి తర్వాత ఎల్ నినో బలహీనపడుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఎల్ నినో బలం పుంజుకుంటే జూన్, జూలై నెలల్లో వర్షపాతం తక్కువగా కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ఖరీప్ సీజన్లో పంటల ఉత్పత్తిపై పడుతుంది. జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేసింది. జూన్‌లో సాధారణం కంటే 23 శాతం తక్కువగా వర్షాలు కురుస్తాయని, జూలైలో 9 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది.
Tags:The monsoon season in Kerala in the first week of June

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *