Natyam ad

ఏకాదశిలలో అత్యంత విశిష్ట మైనది వైకుంఠ ఏకాదశి

నంద్యాల ముచ్చట్లు:
 
నంద్యాల పట్టణంలో కోదండరామాలయం లో వెలసిన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో  13-1-2022 వ తేదీన గురువారము విశేష దివ్యాఅబిశేకం 12 – 01 గంటల వరకు జరుపబడును. ఉదయం 6-గంటల నుంచి స్వామి వారి దివ్య దర్శనం ప్రారంభం అగును. అత్యంత విశేషమైన ఈ పర్వదినమును భక్తాదుల సహయ సహకారములతో ప్రతి ష్టాత్మకముగా అలంకార ప్రియునికి మునుపెన్నడు చేయని విశేష అలంకరణ తో స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు . వైకుంఠం ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా . ఉత్తర ద్వార దర్శనం పూల తోరణం. వైకుంఠ ద్వార పూల తోరణం. ప్రత్యేక వస్తాలంకరణ. ప్రత్యేక పూలంగి సేవ. లడ్డూ పడి సేవ. ఉత్సవ మూర్తులకు విశేష అలంకార సేవ. ప్రత్యేకంగా  లక్ష తులశి మాలలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం లో శంఖముల సమూహంగా స్వామి వారికి విశేష అలంకరణ సేవలు జరుపబడతాయని కమిటీ సభ్యులు తెలిపారు.  కర్ఫ్యూ నేపథ్యంలో 12-1-2022  వ తేదీ జరుగుతున్న ఏకాదశి గడియల్లో జరుగు తున్న పూజలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజలు చూడ టానికి నంద్యాల సిటికేబుల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The most prominent of the Ekadashis is the Vaikuntha Ekadashi