Natyam ad

కూతురు కనిపించలేదని తల్లి ఆవేదన

తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గంగుల

బాలిక ఆచూకీ కోసం  ముమ్మర చర్యలు చేపట్టండి

పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే గంగుల

Post Midle

ఆళ్లగడ్డ ముచ్చట్లు:

 

ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని రామలక్ష్మి కొట్టాల చెందిన బిజిలీ నాగేష్ కుమార్తె బిజిలి శివలక్ష్మి గత శుక్రవారం స్థానిక సెంట్ ఆన్స్ పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయటానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అదే రోజు శుక్రవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో శివ లక్ష్మి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అయితే ఐదు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ విషయాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కి తెలిపారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వెంటనే స్పందించి పట్టణ పోలీసులకు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఐదు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాక పోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు వెంటనే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు.బాలిక ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులకు వెంటనే అప్పగించాలని వారు పోలీసులను కోరారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే వ్యక్తి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో వెంటనే సమస్యలను పరిష్కరించి  వారికి న్యాయం జరిగేంత వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అందులో భాగంగానే బిజిలి శివలక్ష్మి తల్లిదండ్రులు ఐదు రోజులు గడుస్తున్నా తమ కూతురు ఆచూకీగురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో తమ కూతురు ఆచూకి కోసం స్థానిక పట్టణ పోలీసులు ఆశ్రయించామని ఇంతవరకూ వారి వద్ద నుండి ఎలాంటి సమాచారం అందలేదని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఆయన తక్షణమే స్పందించి వెంటనే స్థానిక పట్టణ  పోలీసులకు ఫోన్ చేసి ఐదు రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదని వెంటనే అన్ని రకాల చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయవలసినదిగా పోలీసులను ఆదేశించారు అనంతరం బాలిక తల్లిదండ్రులను ఓదార్చి త్వరలోనే బాలిక ఆచూకీ కనుగొని బాలిక తల్లిదండ్రులకు పోలీసులు అప్పగిస్తామని తెలిపారు.

 

Tags: The mother felt that the daughter had not been seen

Post Midle