మాట వినలేదని కన్నకూతురుపై గంజిపోసిన తల్లి

The mother who frowned at the kannakuttur, who did not listen

The mother who frowned at the kannakuttur, who did not listen

– కుమారై పరిస్థితి విషమం

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

కన్నకూతురుని తప్పుడు పనులు చేయమని తల్లి ఒత్తిడి చేసింది. మాట వినలేదన్న కోపంతో వేడి గంజిని కుమారైపై పోసిన సంఘటన సోమవారం ఉదయం పట్టణ సమీపంలోని నక్కబండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నక్కబండలో కాపురం ఉన్న లక్ష్మమ్మకు కుమారై చల్లమ్మ ఉంది. ఈమెకు ధర్మవరంకు చెందిన రవితో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం చల్లమ్మ భర్తతో కలసి ముగ్గరు పిల్లలు పుంగనూరులో లక్ష్మమ్మ ఇంటికి వచ్చి పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఏడాదన్నర క్రితం చల్లమ్మ భర్త రవి ఆనారోగ్యంతో మరణించాడు. ఇలా ఉండగా లక్ష్మమ్మ కుమారైకు వెంకటేష్‌ అనే మరో యువకుడితో వివాహం చేసింది. అతడికి ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండటంతో లక్ష్మమ్మ కుమారై చల్లమ్మను తప్పుడు పనులు చేయమని ఒత్తిడి చేసేది. ఇందుకు ఆమెకు అంగీకరించకపోవడంతో ఉదయం తల్లి, కుమారైల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో పశువుల కోసం కాచుతున్న గంజిని లక్ష్మమ్మ కుమారైపై పోసింది. ఈ సంఘటనలో చల్లమ్మ తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

స్పందనకు హాజరైన జనం

Tags; The mother who frowned at the kannakuttur, who did not listen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *