కూతుర్ని ప్రియుడి దగ్గరకు పంపించిన తల్లి

Date:14/12/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆడపిల్లకు సురక్షితమైన ప్రదేశం ఏదంటే.. అందరూ టక్కున సొంతిల్లు అని సమాధానమిస్తారు. కానీ కృష్ణా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. జన్మనించిన బిడ్డనే ప్రియుడి పక్కలోకి పంపింది ఓ కర్కోట తల్లి. ఈ ఘటనతో ఆడపల్లకు సొంత ఇంట్లో కూడా రక్షణ ఉండదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో తన మైనర్ కూతురిని (14) బలవంతంగా ప్రియుడు వద్దకు పంపించింది ఓ తల్లి. పరిటాలలో ఓ మహిళ తన భర్త చనిపోవడంతో మైనర్ కూతురితో కలిసి ఉంటోంది.

 

 

 

 

 

అయితే తంగిరాల రాంబాబు అనే వ్యక్తి ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాంబాబు మైనర్ బాలికపై కన్నేశాడు. బాలికను తన వద్దకు పంపాలని ఆమెను బలవంతపెట్టాడు. దీంతో తల్లి అతడి వద్దకు బాలికను బలవంతంగా పంపింది. దీంతో ఒక రాత్రి మొత్తం ఆ ప్రబుద్ధుడు బాలికకు నరకం చూపించాడు.ఈ దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాలిక.. చివరకు తన నానమ్మ వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంది. దీంతో బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లిని, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ గడ్జ మీద కాంగ్రెస్ , బీజేపీలకు స్థానం లేదు

Tags: The mother who sent her daughter to her boyfriend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *