ముదిరాజులు రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలి
– ముదిరాజు సంఘం వ్యవస్థా పక అధ్యక్షుడు శ్రీనివాస్
పెద్దపల్లి ముచ్చట్లు:
ముదిరాజులు రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలని మత్స్య కార్మిక సేవా సమితి ఉమ్మడి కరింనగర్ సంఘం వ్యవస్తాపక అధ్యక్షుడు ఉస్తెం శ్రీనివాస్ కోరారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ మెజారిటీ ప్రతిపాదికనా రాబోయే ఎన్నికల్లో ముదిరాజులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, చట్ట సభల్లో బీసీల తరపున వాణిని వినిపించే అవకాషం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజులు లేనిదే ప్రభుత్వాలు లేవని పేర్కొన్నారు. దామాషా లెక్కల ప్రకారం ముదిరాజులకు అధిక స్థానాలను కేటాయించా లని, ఎన్నికలకు ముందే అధికార టీఆరెస్ పార్టీతో సహా, ప్రతిపక్షాలు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తూ తూ మంత్రంగా సంక్షేమ పథకాలు అందించి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, నిజయతీగా సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. తమ డిమాండ్లను పెడ చెవిన పెడితే ఎన్నికల్లో భంగపాటు తప్పదని, తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కొలిపాక నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా రేండ్ల మల్లికార్జున్, మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కన్వీనరుగా పోలుదాసరి రజిత, ప్రధాన కార్యదర్షిగా సాదుల సుమలత, ఉపాధ్యక్షురాలిగా కుంభం కవితను ఎన్నికున్నారు. ఈ సమావేషంలో నాయకులు భూతగడ్డ సంపత్, నల్లవెల్లి శంకర్, ముత్యం లక్ష్మయ్య, కనుకుంట్ల స్వామి, కలవేని రాజేషం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: The Mudirajas must fight for statehood
