మున్సిపాలిటీ స్వతంత్ర సంస్థ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్  ముచ్చట్లు :
సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో  టిపిసిసి చీఫ్ & ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గోన్నారు.  ఉత్తమ్ మాట్లాడుతూ  ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై  అభ్యంతరం వ్యక్తం చేసారు.  ఎమర్జెన్సీ పేరిట మున్సిపల్ నిధులను తీర్మానం లేకుండా జిల్లా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్ అధికారాన్ని నాశనం చెయ్యడమే.  మున్సిపాలిటీ స్వతంత్ర సంస్థ. కౌన్సిల్ అధ్యక్షులకు ముఖ్యమంత్రి కి ఉన్న అధికారాలు ఉన్నాయి.   ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, సమస్యలపై చర్చించాలి.  ఖర్చుపై ఖచ్చితంగా పారదర్శకత ప్రదర్శించాలి.  కృష్ణ నది జలాలను హుజుర్నగర్ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.  హుజుర్నగర్ లో అర్ధాంతరంగా నిలిచిపోయిన 4వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి.  హుజుర్నగర్ అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ వరకు పోరాడతా..  నకిలీ విత్తనాలపై సీఎం కేసిఆర్ ప్రకటనలకే పరిమితం అయ్యారు.  నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్న ప్రభుత్వం చింతలపాలెం మండలంలో రూ.కోట్ల  నకిలీ విత్తనాల స్కామ్ లో పెద్దమనుషులపై పీడీ యాక్టు కాదుగా కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పిలవడం లేదు.  హుజుర్నగర్ నియోజకవర్గంలో బట్టబయలైన నకిలీ విత్తనాల కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:The municipality is an independent body
Uttam Kumar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *