The murder of a child

చిన్నారి హత్య

Date:08/11/2019

కురబలకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలానికి చెందిన ఆరేళ్ల చిన్నారి వర్షిణీ హత్యకు గురైంది. ఈ విషయం శుక్రవారం తెల్లవారుజామున గుర్తించారు. చిత్తూరు జిల్లా
కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేత నగర్ లో ఉన్నటువంటి కళ్యాణ మండపం వద్ద అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం గుట్టపాలెం కు చెందిన రైతు సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి చేనేత నగర్ సమీపంలోని కళ్యాణమండపంలో పెళ్లికి హాజరయ్యారు. మండపంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు వర్షిని (5)ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ విషయం అర్ధరాత్రి పోలీసులకు తెలుపగా వేకువజామున హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కళ్యాణ మంటపం లోని సీసీ కెమెరాలను పోలీసులు అర్దరాత్రే పరిశీలించారు.

వడ్డీవ్యాపారుల వేదింపులకు యువకుడు బలి

Tags: The murder of a child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *