పుంగనూరు ఆర్టీసి బస్టాండులో యువకుడి హత్యలో వీడని మిస్టరీ
పుంగనూరు ముచ్చట్లు:
విజయదశమి పండుగ రోజైన 23వ తేదీన పట్టణంలోని నడిబొడ్డున గల ఆర్టీసి బస్టాండులో సుమారు 23 సంవత్సరాలు వయసు కలిగిన యువకుడిని తాళ్లతో కట్టేసి హత్య చేశారు. సుమారు పది రోజులు కావస్తున్న ఈ హత్య వీడని మిస్టరీగా మారింది. యువకుడి పేరు, వివరాలు, ఇక్కడ ఎందుకు హత్యకు గురైయ్యాడన్న విషయాలు తెలియరాలేదు. దీనిపై సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేపట్టారు. కానీ యువకుడికి సంబంధించి ఎలాంటి క్లూకూడ లభించలేదు. కాగా హత్యకు గురైన రెండు రోజుల ముందు పుంగనూరు పోలీస్‌స్టేషన్‌కు రావడం జరిగింది. రెండు రోజులకే హత్యకు గురికావడంతో పోలీసులు కేసు చేదించేందుకు అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు. హతుడు వివరాలు తెలిస్తే కేసు చేదించడం సులభమౌతుంది. లేకపోతే ఈ హత్య కేసు మిస్టరీగా మారనున్నది. పట్టణంలో హత్య జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పోలీసులు మాత్రం హత్యను చేదించి, నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.

Tags: The murder of a young man at Punganur RTC bus stand is a mystery
