నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన ‘దారే లేదా’ మ్యూజిక్‌ వీడియో ఈ నెల 18న విడుదల

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

న్యాచురల్‌ స్టార్‌ నాని, యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో సత్యదేవ్‌ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిశారు. తన నిర్మాణసంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని ఈ ‘దారే లేదా’ మ్యూజిక్‌ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్‌ బిస్కేట్‌ ఈ సాంగ్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కరోనా ఫస్ట్‌ అండ్‌ సెకండ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్‌ సాంగ్‌ను అంకితం ఇస్తున్నారు. కోవిడ్‌ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ ‘దారే లేదా’ సాంగ్ ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్‌. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఎన్నో త్యాగాలు చేశారు. తమ కుటుంబ సభ్యుల ప్రేమకు దూరమయ్యారు. కోవిడ్‌ బాధితుల సంక్షేమమే బాధ్యతగా భావించి అంకిత భావంతో పని చేశారు.
విజయ్‌ బులగానిన్‌ ఈ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు.

 

 

 

ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్‌ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్‌ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్‌ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్‌ విడుదల కానుంది. ఈ సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో ఓ సోషల్‌మీడియా యాప్‌లో సత్యదేవ్, రూప మాట్లాడుకుంటున్నారు. వారు వారి మ్యారేజ్‌ యానీవర్సరీ సందర్భంగా ఒకరినొకరు కలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నట్లు పోస్టర్‌ కనిపిస్తుంది. వివిధ ప్రాజెక్ట్స్‌తో  బిజీగా ఉన్న నాని సమర్పిస్తున్న ఫస్ట్‌ మ్యూజిక్‌ వీడియో ‘దారే లేదా’ . మరోవైపు సత్యదేవ్‌ కూడా వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అలాగే ఛాయ్‌ బిస్కేట్‌ కొన్ని సినిమాల నిర్మాణ పనుల్లో ఉన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: The music video for ‘Dare or’ starring Satyadev and Roopa, presented by Nani, will be released on the 18th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *