వీడిన గువ్వలచెరువు మిస్టరీ
కడప ముచ్చట్లు:
కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ మూడు మృతదేహాల మిస్టరీని పోలీసులు ఛేదించారు. విఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎనిమిది బృందాలుగా వీడి దర్యాప్తు చేసారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు జరిపారు. బసవయ్యను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతులు అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. జీవనోపాధి నిమిత్తం గుల్బర్గాకు పన్నెండు మంది వెళ్లారు. జిల్లేడుపల్లి గ్రామ సమీపంలోని ఎండిన కాలువలోని చెలిమిలో నీటిని తాగడంతో వారందరూ అస్వస్థతకు గురైయారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై నలుగురు మృతి చెందారు. వైద్యశాలల్లో చికిత్స చేయించినా ఒక్కోక్కరిగా మృతి చెందారు. స్వగ్రామానికి వస్తూ మార్గమద్యలో ఒక్కోక్కరిగా నలుగురు మృతి చెందారు. విషయం తెలిసిన గ్రామస్థులు మృతదేహాలను గ్రామంలోకి తీసుకురావద్దని చెప్పడంతో బంధువులు గువ్వల చెరువు ఘాట్ లోని ఐదవ మలుపు వద్ద మృతదేహాలను లోయలో పడేసారని పోలసులు నిర్దారించారు.
Tags: The mystery of the abandoned Guvalacheruvu