నక్కబండ దాహార్తి తీరింది

The Nakkabanda Daharti is done

The Nakkabanda Daharti is done

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండ గ్రామంలో మంచినీటి సమస్య తీరిపోయింది. శుక్రవారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని బాస్కర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపిపి రామచంద్రారెడ్డి , స్థానిక మండల పార్టీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో గత నెల రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు ధర్నాలు చేసి, నిరసన తెలిపారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి , ఆయన ఆదేశాల మేరకు బోర్ల మరమ్మతులు చేపట్టి, అదనంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైన తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

నవదాన్యాల అలంకారంలో మారెమ్మ

Tags; The Nakkabanda Daharti is done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *