పేరు గొప్ప ఊరు దిబ్బ

Date:09/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
పేరుకు గొప్ప ఊరికి దెబ్బ అనే సామెతలా మారింది జీహెచ్ఎంసీ వైఖరి. హైదరాబాద్  ఓడిఎఫ్….బహిర్గత మూత్ర విసర్జన రహిత నగరంగా పేరు పొందింది. కానీ అది కేవలం నామామాత్రంగానే మిగిలిపోయింది. స్వఛ్చ్ భారత్ ఎక్కడ కనిపించడం లేదు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పలు ఉచిత టాయిలెట్స్ ను ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే.. కాని వాటిలో ఏ ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో జనాలు అన్ని పనులను బహిర్గతంగా రోడ్డు పైనే కానిచేస్తున్నారు. హైదరాబాద్ చాలా చోట్ల ప్రభుత్వం జీహెచ్ ఎంసీ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కానీ చాలా టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. కొన్నింటికి  తాళాలు వేస్తున్నారు. ఈ టాయిలెట్లు మైన్ సెంటర్లలో ఏర్పాటు చేయటం బానే ఉంది కానీ వాటి వాడకం మాత్రం ఎక్కడ కనిపించటం లేదు. ఎవ్వరు చూసినా డబ్బులు చెల్లించైనా వెలుతున్నారు, లేదంటే బహిరంగానే మూత్ర విసర్జన చేస్తున్నారుజీహెచ్ఎంసీ టాయిలెట్స్ ఎన్ని ఉన్నా కూడా అవి మూసి ఉండటం., ఆ ప్రాంతం మొత్తం చెత్త, చెదారం నిండి దోమలు, ఈగలు వ్యాప్తి చెందటంతో ఆ దారాదాపులకు రావటానికి కూడా ఎవ్వరు ఇష‌్టపడటంలేరు.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం ఎంతగా ఉందో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రారంభించిన రెండు మూడు నెలలే అందరికి అందుబాటులో ఉన్నాయి. మహానరంలో ఎన్నో స్థలాలు., ఎన్నో రోడ్లు ఉన్నాయి. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ నగరంలో స్వచ్చత మాత్రం కరువవుతుంది. ఎన్ని ప్రచారాలు చేసినా అది అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు ప్రభుత్వ టాయిలెట్ల్స్ వల్ల ఈ స్వచ్చత అనే పదాన్ని మరింత కోల్పోతున్నాం. ఎన్ని టాయిలెట్స్ ఉన్నా అందులో తగిన సౌకర్యాలు లేకపోతే అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరులో సమానమే.. ఇక్కడ కూడా అదే పరిస్థితి. టాయిలెట్లను ఏర్పాటు చేయటం బానే ఉంది కానీ అందులో తగిన నీటిసదుపాయం, అండర్ గ్రౌండ్ ఫెసిలిటి లేకపోవటంలో అందరిని ఇబ్బంది కలిగిస్తుంది.
Tags:The name is a great town

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *