పేరుకే… ప్లాస్టిక్ బ్యాన్….ఆచరణల్లో కనిపించని నిషేధం

The name is ... plastic bans .... ban imposed in practice

The name is ... plastic bans .... ban imposed in practice

Date:18/08/2018
నిర్మల్ ముచ్చట్లు:
పర్యావరణానికిహాని కలిగించే ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మూడు పట్టణాలు, 18 మండలాల్లో ప్లాస్టిక్‌కు ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. నిర్మల్‌లో ప్రతి రోజు 68 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండగా.. ఇందులో ప్లాస్టిక్‌ సంచులు, బాటిళ్లు వంటివి దాదాపు ఎనిమిది క్వింటాళ్లు, భైంసాలో 20 మెట్రిక్‌ టన్నులకు సుమారు నాలుగు క్వింటాళ్లు ఉంటున్నాయంటే వినియోగం ఎంత మొత్తంలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
పర్యావరణానికి పెనువిఘాతంగా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్మల్‌ మున్సిపాల్టీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్‌ రహిత జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆగస్టు 15నుంచి చిరు దుకాణదారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ సంచులు విక్రయించకూడదని, వినియోగించవద్దని ప్రకటన జారీ చేశారు. అమలునకు ఆరంభంలోనే పెను విఘాతం కలిగింది. ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ సంచులు పెద్ద మొత్తంలోనే సదరు వ్యాపారులు వాడుతున్నారు.
కూరగాయలు, తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు వాటిలోనే వస్తువులను ప్యాక్‌ చేసి అందజేస్తున్నారు. పర్యావరణానికి పెనుభూతంలా మారిన ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలన్న ధ్యేయంగా అన్నిచోట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
నిర్మల్‌ మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్‌పై సమరం చేస్తామని ప్రకటించినా ఆచరచణలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా మారిందిమరికొందరు వ్యాపారులైతే ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన ప్లాస్టిక్‌ సంచులను, అందులోనూ నాణ్యత లేనివి, నిషేధించిన వాటిని విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి పెద్దమొత్తంలో నష్టం వాటిల్లుతోంది.
ఈ ప్లాస్టిక్‌కు నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని గతంలోనే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. భూసారం తగ్గడం, వాటిని తిన్న పశువులు జీర్ణం కాక మృత్యువాత పడడం, ఆహార పదార్థాలు వాటిలో ప్యాక్‌ చేసి ఇవ్వడం వంటి వాటితో ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం పడడం, మురుగు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తుండడం, చెరువులు, నదులు, కుంటల్లో చేరడంతో నీరు కలుషితం కావడం, తదితర అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంతటి వైపరిత్యాలు కలిగిన ప్లాస్టిక్‌ను నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పుర అధికార యంత్రాంగం సైతం ప్లాస్టిక్‌పై సమర శంఖం పూరించారే తప్ప వాటిని కట్టడి చేయడంలో సరైన దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇష్టారీతిన వాటిని విక్రయించడం, వినియోగిస్తున్నారు. ఇకనైనా నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Tags:The name is … plastic bans …. ban imposed in practice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *