పుంగనూరులో నాలుగేళ్లుగా నిత్య జాతీయగీతాలాపన
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తూ పుంగనూరు పట్టణంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జాతీయగీతాలాపన చేసి, వందన సమర్పణ చేస్తున్నారు. 2018 ఆగస్టు 15న పట్టణంలో తొలిసారిగా జాతీయగీతాలాపన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిల సహకారంతో జనగణమన కమిటి సభ్యులు ప్రకాష్, అయూబ్‌ఖాన్, దీపక్, ఫయాజ్ , బాబు , రెడ్డిప్రసాద్ లు ప్రారంభించారు. పట్టణంలోని గోకుల్‌సర్కిల్, కొత్తయిండ్లు ఎంబిటి రోడ్డు , బస్టాండు, ముడియప్ప సర్కిల్, తూర్పువెహోగశాల, సెంటర్‌లాడ్జి ప్రాంతాల్లో మైకులు ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. 8 గంటలకు సైరన్ రాగానే అధికారులు, ప్రజాప్రతినిధులు, వాహనదారులు, ప్రజలు నిలబడి గీతాలాపన చేసి , వందనం చేయడం ఆనవాయితీగా మారింది. దేశభక్తిని పెంపొందించుకోవడంలో పుంగనూరు ఆదర్శంగా నిలిచింది.

Tags: The National Anthem has been sung continuously for four years in Punganur
